నైజీరియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లాగోస్‌లో గురువారం ప్రయాణీకుల బస్సును రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు స్పాట్ లోనే చనిపోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారని ఆ దేశ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఏజెన్సీ తెలిపింది. లాగోస్‌లోని ఇకెజా ప్రాంతంలో ప్రభుత్వ సిబ్బందిని విధులకు తీసుకెళ్తుండగా బస్సు ఇంట్రా-సిటీ రైలును ఢీకొట్టిందని పేర్కొంది. ఈ ఘటనలో ఇప్పటివరకు 84 మందిని ఆసుపత్రికి తరలించామని తెలిపింది.