చైనా అధ్యక్షుడిగా షీ జిన్ పింగ్ మరోసారి ఎన్నికయ్యారు. జిన్ పింగ్ వరుసగా మూడోసారి ఆ దేశానికి అధ్యక్షుడయ్యాడు. చైనా పార్లమెంట్ జిన్ పింగ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. చైనా అధ్యక్ష పదవీ విరమణ వయసు 68 కాగా, 2018లో పార్టీ రాజ్యాంగాన్ని సవరించారు. దీంతో జిన్ పింగ్ తన జీవిత కాలం అధ్యక్షుడిగా కొనసాగే ఆలోచనలో ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతేడాది ఆయన సీపీసీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.