ఓ వ్యక్తి తన భార్యను అందరూ చూస్తుండగానే ఓడలో నుంచి సముద్రంలోకి విసిరేసిన ఘటన ఇండోనేషియాలో తాజాగా జరిగింది. సుండా స్ట్రెయిట్ గుండా ఫెర్రీలో ప్రయాణిస్తున్న ఓ మహిళ బ్యాగ్ ప్యాక్ చేసుకుంటుండగా ఆమె భర్త ఆమెను సముద్రంలోకి విసిరేశాడు. అదృష్టవశాత్తు ఆమె రెయిలింగ్ పై ఉన్న కడ్డీలను పట్టుకుని ప్రాణాలతో బయటపడింది. భర్తకు మతిస్థిమితం లేదని తెలుస్తోంది. పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకోగా దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.