ధర్మవరం పట్టణంలోని గాంధీనగర్ కు చెందిన ప్రసన్న లక్ష్మీ(40) అనే వివాహిత గురువారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇంటి నుంచి బయటికి వెళ్లిన భర్త మధుసూదన్ గౌడ్ తిరిగి ఇంటికి వచ్చేసరికి ఆమె తన భర్త పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు రెవెన్యూ అధికారుల సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. భార్యాభర్తల తరచు గొడవపడే వారిని స్థానికులు పోలీసులకు తెలిపారు. దీంతో భర్తను పోలీసుల అదుపులో తీసుకొన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని ధర్మారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.