పదో తరగతిలో విద్యార్థుల ఉత్తమ ఫలితాలే లక్ష్యమని డీఈవో మీనాక్షి పేర్కొన్నారు. గురువారం రాత్రి బుక్కపట్నంలో డీఈవో పర్యటించారు. పదో తరగతి విద్యార్థుల గృహాలకు వెళ్లి విద్యార్థులు ఏ విదంగా చదువుకుంటున్నారని తల్లిదండ్రులతో ఆరాతీశారు. టీవీలకు, సెల్ ఫోన్లకు విద్యార్థులను దూరంగా ఉంచాలని, ఉన్న కొద్ది సమయంలో వారు చదువుకునేందుకు తల్లిదండ్రులు ప్రోత్సహించి సదుపాయాలు కల్పించాలని సూచించారు. డీఈవో మాట్లాడుతూ. పదో తరగతి విద్యార్థులు పాఠశాల తరువాత రాత్రి వేళల్లో ఏ విధంగా చదువుకుంటున్నారో తెలుసుకుని వారికి సూచనలతోపాటు మరింత ప్రోత్సాహం అందించేందుకు ఇప్పటికే ఉపాధ్యాయులను ఆదేశించామన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.