ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మూడు రోజుల పాటు వైన్ షాపులు మూతపడనున్నాయి. ఈ నెల 11 సాయంత్రం 4 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం దుకాణాలు మూసేయాలని విశాఖపట్నం జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 13న ఉత్తరకోస్తాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఈ తరుణంలో దీంతో మూడు జిల్లాల్లోని మద్యం దుకాణాల మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు, మద్యం డిపోలతో పాటు స్టార్ హెూటళ్లు, టూరిజం బార్లు, నేవల్ క్యాంటీన్లలలో మద్యం అమ్మకాలను నిషేధించారు.