పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టి మండలం నాయుడు పోలూరు గ్రామంలో త్రాగునీటి సమస్యతో గ్రామస్తులు నిత్యం ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఈ గ్రామంలో సుమారు 50 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జల్జీవన్ పథకం కింద తొలివిడతగా గ్రామానికి సుమారు రూ. 6లక్షల నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు గత ఏడాది బోర్లు తీసి పైపులు వేశారు. కానీ ఇంతవరకు కొళాయిలు బిగించి నీరు ఇవ్వడం లేదని, ఈ మేరకు అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.