పాలకొండ లోఇంటిపన్ను వంద శాతం వసూలు చేయాలని మన్యం జిల్లా పంచాయతీ అధికారి బలివాడ సత్యనారాయణ అన్నారు. గురువారం పాలకొండ మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, విఆర్‌ఒలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటిపన్ను బకాయిలపై దృష్టి పెట్టాలన్నారు. కొత్తగా ఎవరైనా ఇంటిపన్ను వేసుకోవాల్సిన వారు ఉంటే అటువంటి వారిని కూడా గుర్తించాలన్నారు. గ్రామాల్లో స్వచ్ఛత్ కార్యక్రమాన్ని పకడ్భందీగా అమలు చేయాలన్నారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉంచేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ సమావేశంలో ఎంపిడిఒ డొంక త్రినాధులు, పంచాయతీ కార్యదర్శులు, విఆర్‌ఒలు ఉన్నారు.