రాజాము మండలం వీఆర్ అగ్రహారం గ్రామంలో నివాసముంటున్న వివాహితపై అదే గ్రామానికి చెందిన యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. వీఆర్ అగ్రహారం గ్రామంలో ధర్మాన లలిత (25) వివాహిత భర్త పిల్లలతో జీవనం సాగిస్తుంది. అదే గ్రామానికి చెందిన గెడ్డపు మోహన్ రావు గత కొంతకాలంగా ఆమెను లైంగికముగా వేధిస్తుండేవాడు. గురువారం ఎవరూ లేని సమయంలో అతను చూసుకొని ఇంటిలోనికి చొరబడి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో ఆమెను గాయపరిచి పారిపోయాడు. పక్కనే ఉన్న సమీప బంధువులు ఆమెను చూసి దగ్గరున్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.