విజయనగరం జిల్లా, రాజాం అసెంబ్లీ నియోజకవర్గం, తెలగ వీదిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక కొరకు పట్టభద్రులను రాజాం అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ్యులు కంబాల జోగులు గురువారం కలిసారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కంబాల జోగులు మాట్లాడుతూ రాజాం అసెంబ్లీ నియోజకవర్గంలో రాజాం టౌన్లో వున్న పట్టభద్రులు అందరూ జగనన్న నియమించిన వైయస్సార్సీపీ పార్టీ ఉత్తరాంద్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన సీతంరాజు సుధాకర్"కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేసారు. నిరుద్యోగ పట్టభద్రులు అందరికీ రాబోయే రోజుల్లో "సీఎం వైయస్ జగన్" మంచి అవకాశాలు కల్పిస్తారు అని అన్నారు. రాజాం టౌన్లో వున్న పట్టభద్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి గురించి సీఎం చేస్తున్న కృషిని అందరూ గుర్తించాలని అన్నారు.