రేషన్‌కార్డు ఉన్నవారికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. చిరుధాన్యాల పంపిణీపై ఏపీ ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. ఏప్రిల్ నుంచి పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేయనున్నారు. ప్రతినెలా ఇచ్చే రేషన్‌లో 2కేజీల బియ్యం బదులుగా రాగులు, జొన్నలు ఇవ్వనుంది. రైతులను చిరుధాన్యాల సాగువైపు ప్రోత్సహించేలా ఉత్పత్తులు కొనుగోలు చేసి వారికి డబ్బును అందించే వ్యవస్థను కూడా త్వరలోనే తీసుకురానుంది.