చైనాలోని షాంఘైలో ఏడాది చిన్నారి మెదడులో నుంచి ఓ పిండాన్ని వైద్యులు బయటకు తీశారు. ఇలాంటి అరుదైన కేసును ‘ఫీటస్ ఇన్ ఫీటు’ అంటారని వైద్యులు చెబుతున్నారు. 4 నాలుగు అంగుళాల పిండానికి పలు అవయవాలతోపాటు వేళ్ల గోర్లు కూడా అభివృద్ధి చెందాయని, తల్లి గర్భంలో ఉన్నప్పుడే అవి చిన్నారి మెదడులో అభివృద్ధి చెంది ఉంటాయని భావిస్తున్నారు. కవలల్లోని ఒక పిండం ఎదిగి, మరో పిండం ఎదగకపోతే ఇలాంటి సమస్యలు వస్తుందన్నారు.