దేశంలో ఇన్ఫ్లూయెంజా కేసుల వ్యాప్తి కలకలం రేపుతుంది. హెచ్3ఎన్2 వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా ఇప్పటికే ఫ్లూ కేసులు నమోదు కాగా తాజాగా మరణాలు కూడా సంభవించాయి. ఇన్ఫ్లూయెంజాతో దేశంలో ఇప్పటి వరకు ఆరుగురు మరణించారని సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. కర్ణాటకలోని హాసన్ జిల్లా, హర్యానాల్లో 2హెచ్3ఎన్2 మరణాల్ని అధికారులు ధ్రువీకరించగా పంజాబ్లో కూడా మరణాలు నమోదైనట్టు సమాచారం.