పల్నాడు జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను లక్ష్యాల మేరకు సకాలంలో పూర్తయ్యేలా ఆయా శాఖల అధికారులు చూడాలని కలెక్టర్ శివశంకర్ ఆదేశించారు. శుక్రవారం నరసరావుపేట కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముఖ ఆధారిత హాజరు 100 శాతం అమ్ములు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్పందనకు వచ్చే సమస్యలను సచివాలయాల్లోని రికార్డుల్లో తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు.