గుంటూరు: వైద్య ఆరోగ్యశాఖలో సరైన అవగాహన లేకుండా సిబ్బంది వ్యవహరిస్తున్నారని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జి జిహెచ్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే డిఎంహెచ్ ఓ శాఖను సరి చేశానని చెప్పారు. ఆస్పత్రిలో ముదురుతున్న రోగాన్ని సరి చేయాల్సి ఉందన్నారు. రాజన్న, ఎంపీ నిధులతో నిర్మిస్తున్న వేచి ఉండే భవనాన్ని పూర్తి చేయాలన్నారు. భూగర్భ నీటిపారుదలకు రెండు కోట్ల ప్రతిపాదనలను కలెక్టర్ కు వివరించారు.