ఫ్రెంచి చిక్కుడు, కూర మిరప, క్యారట్, బీట్ రూట్ వంటి దుంప పంటలు చలికాలంలో సాగు చేసుకునేందుకు అనుకూలంగా ఉంటాయి. రాత్రి అత్యల్ప ఉష్ణోగ్రత 10-17 డిగ్రీ సెంటిగ్రేడ్ మధ్య ఉండే ప్రాంతాల్లో కూర మిరప సాగు చేసుకోవచ్చు. ఫ్రెంచి చిక్కుడు అధిక ఉష్ణోగ్రత, అధిక మంచును తట్టుకోలేదు. ఉష్ణోగ్రతలు 15 నుంచి 25 డిగ్రీ సెంటిగ్రేడ్ మధ్య ఉంటే ఫ్రెంచి చిక్కుడు మొక్కల పెరుగుదల బాగుంటుంది.