భారత ఎన్నికల సంఘం ఉత్తర్వులను అమలు చేయకుండా పొన్నూరు మున్సిపల్ కమిషనర్ డాక్టర్ ఎన్ రాధ (ఏఈఆర్ఓ) ఇష్టానుసారంగా బిఎల్ఓ లకు ఆదేశాలను జారీ చేస్తుందని బిఎల్ఓ వాట్సప్ గ్రూపు ద్వారా సందేశాలను పంపుతూ తన ఇష్టానుసారంగా వ్యవహరించటం వలన ఏ ఈ ఆర్ వో కు కల్పించిన ఆదేశాలను యూజర్ ఐడి, పాస్వర్డ్ లను అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అయిన డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఇవ్వటం ద్వారా సమాచారం వైసీపీ నాయకులకు చేరి వారి తీదేపా ఓట్లు తొలగిస్తున్నారని పొన్నూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పోల్ మేనేజ్మెంట్ కోఆర్డినేటర్ మాదాల వెంకటేశ్వరరావు శుక్రవారం తాసిల్దార్ కార్యాలయంలో ఎన్నికల అధికారి హరిహరనాథకు ఫిర్యాదు చేశారు. పొన్నూరు మున్సిపల్ పరిధిలోని 55 పోలింగ్ బూత్ లలో తెదేపా సానుభూతి పరుల సుమారు 700 మంది ఓట్లను తొలగిస్తున్నారని అందుకు సహకరిస్తున్న పొన్నూరుమున్సిపల్ కమిషనర్ డాక్టర్ ఎన్ రాధ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులొ కోరారు.