పలు అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ సిహెచ్ విజయప్రతాప్‌రెడ్డి శుక్రవారమూ పరిశీలనలు కొనసాగించారు. పలు అంశాలపై సిబ్బందిని హెచ్చరించారు. పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల, మాచవరం, కారెంపూడి మండలాల్లో తనిఖీల్లో భాగంగా మాచవరం మండలం పిల్లుట్ల కస్తూర్బా పాఠశాలలో పిల్లలకు టిఫిన్, భోపనంలో గొడ్డుకారం వేస్తున్నారని, సరుకులను పక్కదారి పట్టిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని ప్రిన్సిపల్, సిబ్బంది ప్రశ్నించారు. పిల్లలతో ఏకాంతంగా మాట్లాడి వారి వద్ద నుంచి సమాచారం తీసుకున్నారు. ప్రిన్సిపల్, అకౌంటెంట్‌పై చర్యల కోసం జెసికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.