అంతర్జాతీయ మహిళా దినోత్సవ స్ఫూర్తితో మహిళల అంతా తమ హక్కు ల కోసం పోరాడాలని ఐద్వా పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటుపల్లి రజిని పిలుపు నిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినో త్సవం కార్యక్రమం శుక్రవారం స్థానిక కొత్త పేటలోని మహాలక్ష్మి చెట్టు వద్ద నిర్వ హించిన సదస్సుకు పి. శివ అధ్యక్షత వహించారు. రజిని తన ప్రసం గాన్ని కొన సాగిస్తూ బట్టల మిల్లుల్లో పని చేసే కార్మికులు ఎనిమిది గంటల పని విధానం కోసం, వేతనాలు పెంచాలని, మెరుగైన వైద్యం కోసం అనేక పోరా టాలు చేసి ఫలి తం సాధించారని అన్నారు. ఫలితంగానే ఈరోజు మనం ఈ మాత్రమైనా జీవించ గలుగుతున్నామన్నారు. బాల్య వివాహాలు రద్దు చేయాలని అబ్బాయితో పాటు అమ్మాయిని కూడా సమానంగా చూడా లని చదివించాలని అన్నారు.