తెనాలి: రెయిన్బో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈనెల 12న ఆదివారం పట్టణ చెంచుపేట లోని శ్రీ శబరి వృద్ధాశ్రమం ఆవరణంలో నిర్వహించనున్న ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ట్రస్ట్ వ్యవస్థాపకురాలు డాక్టర్ జీవనలత తెలిపారు. పట్టణంలోని ట్రస్ట్ కార్యాలయంలో శుక్రవారం ఆమె మాట్లాడారు. వివిధ రకాల క్యాన్సర్లు, గుండె, ఎముకలు, కంటి, మధుమేహం తదితర ఆరోగ్య సమస్యలను పరీక్షించి ఉచితంగా మందులు అందజేస్తామన్నారు.