వేసవిలో వడదెబ్బ తగిలే సూచనలెక్కువ. అలాంటప్పుడు గ్లాసుడు నీటిలో నిమ్మరసం, ఉప్పు, పంచదార వేసి రోజుకు 3 లేదా 4 సార్లు తాగుతూ ఉండాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. వడదెబ్బ తగిలిన వ్యక్తి అరచేయి, అరికాలుపై మేక పాలతో మర్దన చేయాలి. అలాగే, గ్లాసు నీటిలో ధనియాల పొడి, కొద్దిగా ఉప్పు, చక్కెర వేసి మరిగించి రోజుకు 3, 4 సార్లు తీసుకుంటే ఉపశమనం కలుగుతుందంటున్నారు.