ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ అధికారిపై విచారణకు ఆదేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 11, 2023, 10:17 AM

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్. ఎల్. సి ఎన్నికల్లో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన విశాఖ ప్రొహిబిషన్, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ పై సమగ్ర విచారణ చేసి తక్షణం నివేదిక ఇవ్వాల్సిందిగా ఎన్నికల అధికారి డాక్టర్ ఎ. మల్లికార్జున భీమునిపట్నం ఆర్. డి. ఓ ను ఆదేశించారు. అధికార పార్టీ అభ్యర్ధికి ఓటు వేయాలని కోరుతూ స్థానిక సుబ్బలక్ష్మీ కళ్యాణ మండపంలో మార్చి 7వ తేదీ సాయంత్రం 4గంటలకు ఎక్సైజ్ సిబ్బందితో ఈ డిప్యూటీ కమిషనర్ సభ ఏర్పాటు చేశారన్నది అభియోగం. సిపిఐ నాయకుడు జగ్గునాయుడు చేసిన ఫిర్యాదు మేరకు దీనిపై విచారణ చేసి తక్షణం నివేదిక ఇవ్వాలని ఎన్నికల అధికారి ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com