సూర్య నమస్కారాల వలన ఊపిరితిత్తులు, జీర్ణకోశం, నాడీ మండలం, గుండె మొదలైన అవయవాలన్నీ బలపడతాయి. శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా జరిగి అంగసౌష్టవం పెరుగుతుంది. నడుము సన్నగా అవుతుంది. ఛాతీ వికసిస్తుంది. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. 12 భంగిమలతో కూడిన సూర్యనమస్కారాలలో ప్రాణాయామం, ధ్యానం, వ్యాయామం కూడా ఇమిడి ఉన్నాయి. ఇవి శరీరంలో ఉండే ప్రతి అవయవంలోని విష పదార్థాలను సహజ సిద్ధంగా తొలగిస్తాయి.