విశాఖ జిల్లా పెదగంట్యాడ సమీపంలో హిందూజా నేషనల్ పవర్ కార్పొరేషన్ ద్వారా భారీ పరిశ్రమల వ్యర్థాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. ఓ వైపు బీచ్పరిశుభ్రతకు అధికారులు తీవ్రంగా కృష్టి చేస్తుంటే ఇలా హిందూజా పరిశ్రమ వ్యర్థాలను సాగరతీరంలో శుక్రవారం సాయంత్రం విడిచిపెట్టింది. ఇలాంటి చర్యలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పర్యావరణ ప్రియులు కోరుతున్నారు. వ్యర్థాల వల్ల బీచ్ కలుషితంతో పాటు, సముద్రంలో మత్స్య సంపదకు చేటు కలిగే అవకాశం ఉంది.