శ్రీకాళహస్తి, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధిగా ప్రముఖ న్యాయవాది కుంట్రపాకు సురేంద్రబాబు ముదిరాజ్ ను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకరరావు ప్రకటించారు. తిరుపతిలో శనివారం పలువురు బిసి నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. సమావేశానంతరం అధికార ప్రతినిధిగా కుంట్రపాకు సురేంద్రబాబు ముదిరాజును నియమించినట్లు ప్రకటించి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాజకీయ పార్టీగా ఆవిర్భవించి 175 స్థానాల్లోనూ బీసీ ప్రతినిధులు పోటీ చేస్తారని తెలిపారు. బీసీ సమస్యలపై నిరంతరం పోరాటం నిర్వహించి వారికి న్యాయం జరిగే విధంగా కృషి చేయాలని కోరారు. చట్టసభలలో బీసీలకు ప్రాతినిత్యం వచ్చేలా రాజ్యాధికారం దిశగా కృషి చేయాలని కోరారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు సముచిత స్థానం ఇవ్వాలని కోరారు. బీసీల అభివృద్ధి సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నామన్నారు. యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు కుమ్మరి క్రాంతి కుమార్, జిల్లా అధ్యక్షులు నాగరాజు గౌడ్ తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.