ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నల్లమాడ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాలను శనివారం డీఎస్పీ యశ్వంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు. పోలింగ్ జరిగే రోజు కేంద్రం వద్ద 144 సెక్షన్ను అమలు చేయాలన్నారు. ఆయనతోపాటు నల్లమాడ ఎస్ఐ వలీబాషా, ఎఎస్ఐ సరేంద్రలు ఉన్నారు.