సన్ ఛార్జ్ వాటర్ తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. నీటిని గాజు సీసాలో నింపి కనీసం 8 గంటలు సూర్యకాంతిలో ఉంచాలి. ఈ నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిజ్ లో పెట్టకూడదు. ఈ నీటిని తాగితే అల్సర్స్, గుండెల్లో మంట, జీర్ణ సమస్యలు తొలగుతాయని అంటున్నారు. ఎముకలు బలంగా ఉండేలా చేసి, చర్మ సమస్యలు దూరం చేస్తుందని చెబుతున్నారు. చర్మం అందంగా తయారవుతుందంటున్నారు.