టిడిపి వాల్మీకి సాధికార సమితి పార్లమెంటు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా గుంతకల్లు పట్టణానికి చెందిన తలారి మస్తానప్ప నియమి తుడయ్యారు. ఈ మేరకు టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు కాలువ శ్రీనివాసులు నుంచి శుక్రవారం తలారి మస్తానప్ప నియామక ఉత్తర్వులను అందుకున్నారు. తనను ఎంపిక చేసిన అధిష్టానానికి, పదవి రావడానికి కృషి చేసిన కాలువ శ్రీనివాసులు, నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే ఆర్. జితేంద్ర గౌడుకు మస్తానప్ప ధన్యవా దాలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేస్తానని ఆయన చెప్పారు.