కడప, అనంతపురం, కర్నూలు పట్టభద్రులు, ఉపాధ్యాయుల శాసనమండలి ఎన్నికల సంబంధించి. పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు ఈనెల 11వ తేదీ సాయంత్రం 4గంటల నుండి ఎన్నికల నిబంధనల మేరకు ప్రచారాన్ని నిషేదించడమైనదని రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి శనివారం తెలిపారు. ఎన్నికల నియమ నిబంధనల మేరకు పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటలముందు ఆంక్షల (సైలెంట్ పీరియడ్)లో భాగంగా పోలింగ్ నిర్వహించే ఏరియాలో ఎన్నికల ప్రచారాలు, వాటికి సంబంధించి ఎలాంటి పోస్టర్లు, వీడియోలు నిషిద్ధం అన్నారు. ఈ విషయాన్ని ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థుల, ఆయా పార్టీల ప్రతినిధులు గమనించి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి తెలిపారు.