అరటి తొక్కను ఉడికించిన నీటిని రోజూ తాగడం వల్ల ఒత్తిడిని జయించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ నీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు కళ్లకి పోషకాలు అందిస్తాయని చెబుతున్నారు. అరటిపండు తొక్క, కొద్దిగా వంటసోడా, సరిపడా నీళ్లు వేసి మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖానికి పూతలా రాసి 10 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే ముఖం తాజాగా, కోమలంగా మారుతుందని పేర్కొంటున్నారు.