బాపట్ల, చీరాల సబ్ డివిజన్ల పరిధిలో 2022 వ సం. లో నమోదై ఇప్పటికీ విచారణ దశలో ఉన్న కేసుల గురించి శుక్రవారం ప్రత్యేకంగా బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ శుక్రవారం సమీక్ష జరిపారు. ప్రతి కేస్ ఫైల్ ను స్వయంగా క్షుణ్ణంగా పరిశీలించారు. విచారణ దశలో ఉన్న కేసుల దర్యాప్తు వేగవంతం చెయ్యాలని ఆయన ఆదేశించారు. సైబర్ నేరాలలో విచారణ వేగవంతంగా పూర్తి చేస్తేనే బాధితులకు న్యాయం చెయ్యగలమని జిల్లా ఎస్పీ అన్నారు. పరుచూరు, చీరాల సబ్ డివిజన్ల పరిధిలోని డిఎస్పీలు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐ లు పాల్గొన్నారు.