ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండలంలోని నాగంపట్ల వారి పాలెం గ్రామంలో సందర్శించిన వ్యవసాయ శాఖ అధికారి మండల ప్రకృతి వ్యవసాయ ఇంచార్జ్ నరసింహులు ఆధ్వర్యంలో శనివారం నాడు రాములు అనే రైతుతో ద్రవ జయరామృతాన్ని తయారు చేయించారు. ఈ కార్యక్రమంలో నరసింహులు మాట్లాడుతూ 20 కేజీల నాటు ఆవు పేడ, ఐదు లీటర్ల మూత్రం, రెండు కేజీల బెల్లం, పట్టుమట్టిని 20 లీటర్ల నీటిలో కలుపుకుంటే ఈ జయరామృతాన్ని తయారు చేయవచ్చని ఆయన తెలియజేశారు. దీని వల్ల భూసారం పెరుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని నరేష్ సురేష్ కృష్ణ వంటి రైతులు పాల్గొన్నారు.