కడప జిల్లా ఒంటిమిట్ట మండల పరిధిలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం చేపట్టారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో అధ్యక్షతన ఆరోగ్య వైద్య సిబ్బంది పాఠశాల ఉపాధ్యాయులకు వారి విద్యార్థుల సంఖ్యను అనుసరించి అందజేశారు. ప్రభుత్వ వైద్యురాలు మాట్లాడుతూ ఒకటి నుండి 18 సంవత్సరాల మధ్య వయసు కలిగిన ప్రతి ఒక్కరికి మార్చి 14వ తేదీన నులిపురుగుల నివారణ మాత్రలను అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, విద్యా సిబ్బంది పాల్గొన్నారు.