అన్నమయ్య జిల్లా రాజంపేట గర్ల్స్ హైస్కూల్ లో ఏడవతరగతి చదువుతూ ఇంటిగ్రేటేడ్ హాస్టల్ లో ఉంటున్న లావణ్య అనే విద్యార్థినికి ఆమె తల్లి వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంది. ఈ విషయాన్ని శుక్రవారం రాత్రి 10-50 గంటలకు ప్రెస్ గ్రూపుల్లో పెట్టడంతో ప్రధానంగా టౌన్ ఎస్ఐ ప్రసాద్ రెడ్డి వేగంగా స్పందించారు. వెంటనే హాస్టల్ అధికారిని శోభారాణి ఫోన్ చేసి విద్యార్థిని తల్లిదండ్రుల వివరాలు, ఫోన్ నంబర్ తెలుసుకున్నారు. విద్యార్థిని తల్లి నంబర్ కు ఫోన్ చేయగా ఆమె సెల్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టింది. దీంతో ఎస్ఐ ప్రసాద్ రెడ్డి సెల్ ఫోన్ నంబర్ ఆధారంగా లొకేషన్ ను సెర్చ్ చేశారు. 10-30 గంటల వరకు సెల్ నంబర్ పట్టణం లోనే ఉన్నట్లు తేలింది. దీంతో ఎస్ఐ, ఇంటిగ్రేటెడ్ హాస్టల్ వార్డెన్ లావణ్య వివాహాన్ని ఆపేందుకు తీవ్రంగా ప్రత్నించగా చివరికి తెల్లవారు జామున ఒంటి గంట ప్రాంతంలో వేణుగోపాల స్వామి గుడిలో వివాహం జరుగుతున్నట్లు తెలుసు కొని బాల్య వివాహానికి బ్రేక్ వేశారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో విషయం తెలిసినా ఎస్ఐ ప్రత్యేక శ్రద్ద తీసుకోవడం తో అతి పిన్న వయసు ఓ బాలికకు వివాహం కాకుండా ఆగిపోయింది. ఇందువల్ల ఆ బాలిక మరి కొన్ని సంవత్సరాల పాటు చదువుకునే అవకాశం కలిగింది. ఇదిలా ఉంటే అంతకు ముందు హాస్టల్ వార్డెన్ శోభారాణి లావణ్య వివాహానికి అడ్డుకట్ట వేసేందుకు తనవంతు ముమ్మరంగా ప్రయత్నించారు.