సంఘసంస్కర్త, రచయిత్రి, ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే వర్ధంతిని శుక్రవారం ప్రొద్దుటూరు స్థానిక శివాలయం వీధిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సావిత్రిబాయి పూలే సమాజానికి, దేశానికి అందించిన సేవలు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయునిగా మహిళలకు ఆదర్శంగా నిలిచారని ఆమె సేవలను వారు స్మరించుకొన్నారు. కార్యక్రమంలో టీడీపి బిసి సెల్ రాష్ట్ర కార్యదర్శి సుంకర వేణుగోపాల్, కడప పార్లమెంటరీ బిసి సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి పి. సత్యసాయి సుబ్బరాజు, టిడిపి పార్లమెంటరీ కార్యదర్శి సిద్ధయ్య, రాష్ట్ర దేవాంగ సాధికారిక కమిటి కార్యదర్శి అంపావతిన సుబ్బు, పట్టణ నందమూరి యువ సేవాసమితి అధ్యక్షుడు గోమేధికమ్ సుదర్శన్, మహేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.