ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి జాతీయ మైనారిటీ కమిషన్ సలహాదారుడిగా రాజంపేట అసెంబ్లీ నందలూరు ప్రాంతానికి చెందిన షేక్ షబ్బీర్ అహ్మద్ ని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మైనారిటీలు ఎదుర్కొంటున్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేటట్లు చేస్తానని తెలిపారు. మైనారిటీలను భారతీయ జనతా పార్టీ వైపు ఆకర్షితులయ్యేటట్లు పనిచేస్తానని అన్నారు. జాతీయస్థాయిలో ప్రభుత్వపరంగా నామినేటెడ్ పోస్టులను ఇప్పించుటకు కృషి చేసినటువంటి రాజంపేట పార్లమెంట్ ఇంచార్జ్ సాయి లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.