ఏపీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 14 నుండి ప్రారంభం కానున్నాయి. 14వ తేదీ గవర్నర్ ప్రసంగించగా, 17వ తేదీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. రూ.2.60 లక్షల కోట్లతో 2023-24 వార్షిక బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశాల్లో మూడు రాజధానులపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. విశాఖ రాజధాని అంశంపై తీర్మానం చేసి కేంద్రానికి పంపాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.