ఇండోనేషియా రాజధానిని జకార్తా నుంచి బోర్నియో ద్వీపానికి మార్చుతున్నారు. జకార్తా నగరం జనసంద్రంగా మారడం, కాలుష్యంతో నిండిపోవడం, భూకంపాల ముప్పు ఉండటం, జావా సముద్రంలోకి వేగంగా మునిగిపోయే అవకాశం వంటివాటి వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. బోర్నియో సుస్థిరమైన అటవీ నగరంగా ఉంటుందని, అభివృద్ధిలో పర్యావరణ పరిరక్షణకే పెద్ద పీట వేసి 2045 నాటికి కార్బన్ న్యూట్రల్ సిటీగా తీర్చిదిద్దుతామని అక్కడి అధికారులు చెప్తున్నారు.