తెలుగు రాష్ట్రాల ప్రజలు కొద్ది రోజులుగా ఎండ వేడికి సమతమమవుతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణశాఖ చల్లని వార్త చెప్పింది. ఈనెల 16 నుంచి 20 వరకు చల్లనిగాలులు వీస్తాయని చెప్పింది. అలాగే పలుచోట్ల సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. పడమర గాలులతో ఏర్పడిన ద్రోణి బిహార్ నుంచి ఛత్తీస్గడ్, విదర్భ, తెలంగాణ మీదుగా దక్షిణ కర్ణాటక వరకు సాగుతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయి.