ఇన్ స్టాగ్రాంలో అసభ్యంగా మెసేజ్ లు పంపుతున్న యువకుడ్ని మహిళ చెప్పుతో కొట్టిన ఘటన ఏపీలోని నెల్లూరు జిల్లా కావలిలో జరిగింది. టీ దుకాణంలో పనిచేసే కల్యాణ్ అనే యువకుడు ఓ వివాహితకు ఇన్ స్ట్గాగ్రాంలో తరచుగా అసభ్యకర మెసేజ్ లు పంపేవాడు. దీంతో ఆ యువకుడు అడ్రస్ సేకరించిన మహిళ, అక్కడికి చేరుకుని నడిరోడ్డుపై యువకుడ్ని చెప్పుతో కొట్టింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.