మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుపై నటుడు రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. వెంకయ్యకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం తనకు వ్యక్తిగతంగా నచ్చలేదని, గొప్ప నాయకుడిని రాజకీయాల నుండి దూరం చేశారని రజనీకాంత్ అన్నారు. ఉపరాష్ట్రపతి హోదాలో ఎలాంటి అధికారాలు ఉండవని, చాలా విషయాల్లో ప్రోటోకాల్ కండిషన్స్ ఉంటాయని అన్నారు. వెంకయ్య మరికొన్ని రోజుల పాటు కేంద్రమంత్రిగా కొనసాగివుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.