ఎండాకాలం వచ్చిందంటే చాలు మన శరీరంలో వేడి పెరిగి ఇబ్బందులు పడుతుంటాం. శరీరంలో వేడి తగ్గాలంలే ఎక్కువగా నీరు తీసుకోవాలి. శరీరం డీహైడ్రేడ్ కాకుండా చూసుకోవాలి. టీ స్పూన్ మెంతుల్ని పొడిగా చేసుకుని నీళ్లలో వేసుకుని తాగినా.. లేదా మెంతుల్ని అలాగే తిన్నా వేడి తగ్గుతుంది. కర్బూజా పండ్లు, అరటి, పుచ్చకాయ, బొప్పాయ, యాపిల్, గసగసాలు, ఎండుద్రాక్ష, ఎండు ఖర్జూరం చలవచేసే వాటిలో చాల ముఖ్యమైనవి.