హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లు ఇలా ఎక్కడ పడితే అక్కడ తినడం వల్ల చాలామంది ఫుడ్ పాయిజన్ బారిన పడుతుంటారు. దీంతో వాంతులు, విరేచనాలు, నీరసం వస్తాయి. ఈ క్రమంలో జీలకర్ర నోట్లో వేసుకుని నమిలి ఆ రసాన్ని మింగితే ఫలితం ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పొట్టలో వికారంగా ఉంటే 3 పూటలా ఓ స్పూన్ తేనెను తీసుకోవాలి. అరటి పండ్లు పేస్టులా చేసి పాలలో కలిపి తీసుకుంటే నీరసం తగ్గుతుంది.