ట్రెండింగ్
Epaper    English    தமிழ்

16 ఏళ్లకే 'ఇండియాస్ ఏఐ కిడ్'గా గుర్తింపు లక్షన్నర మందికి ఏఐలో శిక్షణ ఇచ్చిన టెక్ నిపుణుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 20, 2026, 07:19 PM

ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో ఓ భారతీయ బాల మేధావి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. 'ఏఐ కిడ్ ఆఫ్ ఇండియా'గా పేరుగాంచిన 16 ఏళ్ల రావుల్ జాన్ అజు, ఈ అంతర్జాతీయ వేదికపై టెక్ నిపుణులు, దేశాధినేతల నుంచి ప్రశంసలు అందుకుంటూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  రంగంలో అతను సాధించిన అద్భుతమైన ప్రగతికి ఈ సదస్సులో అరుదైన గౌరవం దక్కింది.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రావుల్, తనకు ఈ సదస్సులో ప్రసంగించే అవకాశం రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. ఏఐ వల్ల కలిగే లాభనష్టాలను, ప్రపంచ సమస్యల పరిష్కారంలో భారత్ ఎందుకు నాయకత్వం వహించాలో తాను వివరించనున్నట్లు తెలిపాడు. ఈ సదస్సులో భాగంగా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్‌ను కలిసే అవకాశం కూడా రాహుల్‌కు దక్కింది.ఆ క్షణంలో నేను ఇంకా షాక్‌లోనే ఉన్నాను. కేవలం 'హాయ్' మాత్రమే చెప్పగలిగాను. ఆయనతో కొన్ని నిమిషాల సంభాషణలో చాలా నేర్చుకున్నాను. అదొక అద్భుతమైన అనుభవం అని రావుల్ ఆనందంగా పంచుకున్నాడు.గతవారమే తాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశానని, ఆయన దార్శనికత, మార్గనిర్దేశం తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని రాహుల్ తెలిపాడు. టెక్నాలజీ, డీప్ టెక్ రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ప్రధాని కృషి అమోఘమని కొనియాడాడు. కొంతకాలం క్రితం రావుల్ రూపొందించిన ఏఐ టూల్స్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంతో అతను వెలుగులోకి వచ్చాడు.భవిష్యత్ ప్రణాళికల గురించి అడగ్గా, తన నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవడానికి విదేశాలకు వెళ్లే ఆలోచన ఉన్నప్పటికీ, అంతిమంగా మాతృభూమే తనకు తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa