ఏప్రిల్ 1 నుంచి జాతీయ రహదారుల టోల్ ప్లాజాల్లో నగదు చెల్లింపులు నిలిపివేయనున్నట్లు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) వెల్లడించింది. ఇకపై టోల్ చెల్లింపులు ఫాస్టాగ్, UPI ద్వారానే స్వీకరించబడతాయని తెలిపింది. హైవేలపై అంతరాయంలేని ప్రయాణం, డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ప్రయాణికులు ముందుగానే ఫాస్టాగ్ లేదా UPI సదుపాయం ఏర్పాటు చేసుకోవాలని సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa