ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను చంపేసిన భార్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 20, 2026, 08:03 PM

టీవీ సౌండ్ తగ్గించే విషయంలో మొదలైన చిన్న గొడవ హత్యకు దారి తీసింది. భార్య భర్తను దారుణంగా కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన గుంటూరు జిల్లాలో కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు ప్రాథమికంగా చెబుతున్న వివరాల ప్రకారం.. మంగళగిరి మండలం పెదవడ్లపూడికి చెందిన షేక్‌ అహ్మద్‌ ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. క్రాంతి అనే యువతికి అహ్మద్ 8 నెలల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఈ జంట కొంతకాలంగా మంగళగిరి టిడ్కో ఇళ్లలో బీ-16 బ్లాకులో నివాసం ఉంటున్నారు. అహ్మద్ రంజాన్‌ ఉపవాస దీక్షలో ఉన్నాడు.. గురువారం ఇంటికి వచ్చాడు. అయితే ఆ సమయంలో భార్య క్రాంతి సౌండ్ పెంచి టీవీ చూస్తోంది.


ఇంట్లో టీవీ సౌండ్‌ ఎక్కువగా ఉండటంతో అహ్మద్.. తగ్గించమని అహ్మద్‌ భార్య క్రాంతికి సూచించాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగిది. ఇంతలో అహ్మద్ భార్యపై చేయిచేసుకున్నాడు. ఇద్దరి మధ్య వివాదం ముదిరింది.. ఆ కోపంలో క్రాంతి అక్కడే ఉన్న ఉల్లిపాయలు కోసే కత్తి తీసుకుని భర్త అహ్మద్‌ను పొడిచింది. అయితే కొందరు స్థానికులు గమనించి అహ్మద్‌ను వెంటనే ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా.. అహ్మద్‌ అప్పటికే చనిపోయాడు. మృతుడి తల్లి మహాబీ పోలీసులకు ఫిర్యాదు చేడయంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అహ్మద్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్న అహ్మద్‌కు ఏడాదిన్నర క్రితం క్రాంతితో పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది.. ఆమెకు గతంలోనే వివాహమైందట.. ఆమె భర్త జైలులో ఉన్నాడట. అహ్మద్‌తో పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. 8 నెలల క్రితం అహ్మద్‌, క్రాంతిలు పెళ్లు చేసుకుని మంగళగిరి టిడ్కో ఇళ్లలో బీ-16 బ్లాకులో ఉంటున్నారు. ఇంతలో టీవీ సౌండ్ విషయంలో మొదలైన గొడవలో అహ్మద్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa