క్రికెట్ ప్రపంచంలో చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మైదానంలో కనిపించే తీవ్రత, కరచాలనం చేసుకోకపోవడం అంతా కేవలం ప్రజలను, కెమెరాలను మభ్యపెట్టేందుకేనని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మైదానంలో ఒకరినొకరు పలకరించుకోని ఈ ఆటగాళ్లు, తెరవెనుక, మూసి ఉన్న గదుల్లో మాత్రం స్నేహంగానే మాట్లాడుకుంటారని, అంతా బాగున్నట్లే ప్రవర్తిస్తారని కుక్ ఆరోపించాడు.ఇటీవల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్ చేతిలో పాకిస్థాన్ ఓటమి పాలైన నేపథ్యంలో స్టిక్ టు క్రికెట్' అనే పాడ్కాస్ట్లో ఈ అంశంపై చర్చ జరిగింది.భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఇప్పుడు ఏకపక్షంగా మారింది అని అభిప్రాయపడ్డాడు. దీనికి మైఖేల్ వాన్ స్పందిస్తూ, పాకిస్థాన్ ఆటగాళ్లు భారత జట్టును చూసి భయపడుతున్నట్లు కనిపిస్తోందన్నాడు.రెండు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకోకపోవడం సిగ్గుచేటుగా, బాధాకరంగా ఉందని పేర్కొన్నాడు.అయితే, అలిస్టర్ కుక్ మాత్రం ఈ అంశాన్ని భిన్నమైన కోణంలో విశ్లేషించాడు.వాళ్లు మూసి ఉన్న గదుల్లో మాట్లాడుకోవడం లేదా అందరూ సాధారణంగానే చాట్ చేసుకుంటున్నారని నేను ఎక్కడో చదివాను. మైదానంలో కరచాలనం చేసుకోకపోవడం అనేది కేవలం ప్రదర్శన కోసమే. తెరవెనుక మాత్రం వాళ్లంతా మాట్లాడుకుంటారు, అంతా బాగుంటారు అని కుక్ పేర్కొన్నాడు
.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa