ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మండలిలో శ్రీవారి చిత్రాలతో వైసీపీ ఎమ్మెల్సీల పై అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 20, 2026, 08:55 PM

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో శుక్రవారం తీవ్ర గందరగోళం, వాగ్వాదం చోటుచేసుకుంది. శ్రీవారి చిత్రపటాలను చేతబట్టుకుని వైసీపీ ఎమ్మెల్సీలు నిరసనకు దిగడం పెద్ద వివాదానికి దారితీసింది. చెప్పులు, బూట్లు ధరించే వారు స్వామివారి చిత్రాలను పట్టుకుని సభలో అపవిత్రంగా ప్రవర్తించారని, ఇది 'మహాపచారం' అని అధికార పక్ష సభ్యులు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఈ గందరగోళం మధ్య శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు సభను వాయిదా వేశారు. తిరుమల లడ్డూ ప్రసాదం కోసం నెయ్యి సరఫరా అంశంపై చర్చకు తామిచ్చిన వాయిదా తీర్మానాన్ని ఛైర్మన్ తిరస్కరించడంతో వైసీపీ సభ్యులు పోడియం వద్దకు దూసుకెళ్లి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే వారు శ్రీవారి చిత్రాలను ప్రదర్శించారు. ఈ ఘటనపై రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా స్పందించారు.గతంలో తిరుమల వెళ్ళినప్పుడు జగన్ చెప్పులతోనే ఆలయ ప్రాంగణం అంతా తిరిగాడు. ఈరోజు వైసీపీ నేతలు మండలిలో చెప్పులు, బూట్లు వేసుకునే వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను పట్టుకున్నారు. చేసిన తప్పులకు లెంపలు వేసుకుని హిందువులకు క్షమాపణలు కోరాల్సింది పోయి, అడ్డంగా అబద్దాలు చెబుతూ ఛాలెంజ్‌లు చేస్తున్నారంటే వీళ్ళని ఏమనాలి అని ఆయన ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa