ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మన వారసత్వాన్ని నిలబెట్టే జ్ఞాన మందిరం – అమరావతి స్టేట్ సెంట్రల్ లైబ్రరీ”

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 20, 2026, 08:53 PM

విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు  ప్రజా రాజధాని అమరావతిలో నిర్మించనున్న స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సంస్కృతి వైభవాన్ని ప్రతిబింబించేలా ఉండాలని అన్నారు.ఉండవల్లిలోని తన నివాసంలో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. అమరావతిలో ప్రతిపాదిత స్టేట్ సెంట్రల్ లైబ్రరీ నమూనాను పరిశీలించి, నిపుణులు రూపొందించిన ప్రెజెంటేషన్ వీడియోను వీక్షించారు. లైబ్రరీ నిర్మాణంపై పలు సూచనలు చేస్తూ, అంతర్జాతీయ ప్రమాణాలతో, ఆధునిక సాంకేతిక సదుపాయాలతో దీన్ని సమగ్ర జ్ఞాన కేంద్రంగా అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు.మన ఘన చరిత్ర, వారసత్వానికి ప్రతీకగా నిలిచేలా ఈ లైబ్రరీ రూపుదిద్దుకోవాలని, ప్రజల ఆశయాలు, ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా రూపకల్పన చేయాలని మంత్రి సూచించారు. ఆర్కైవ్స్, ఆడిటోరియం సౌకర్యాలతో పాటు 15 లక్షలకు పైగా పుస్తకాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యార్థుల సమగ్ర వికాసానికి తోడ్పడే విధంగా, అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజా జ్ఞాన వేదికగా దీన్ని తీర్చిదిద్దాలని అన్నారు. ఇందుకు అవసరమైన మొత్తం ఎకోసిస్టమ్ అభివృద్ధిపై దృష్టి సారించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా పదో తరగతి పరీక్షల నిర్వహణ, అభ్యసన సామర్థ్యాల పెంపుపై కూడా చర్చ జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఎఫ్ఎల్ఎన్ అమలు పురోగతి, క్లిక్కర్ వీడియోల వినియోగం, పదో తరగతి విద్యార్థుల కోసం రూపొందించిన వంద రోజుల కార్యాచరణ ప్రణాళికపై సమీక్షించారు. విద్యార్థుల హాజరు, మార్కులు తదితర వివరాలను తెలుసుకునేందుకు ప్రవేశపెట్టిన ‘లీప్ యాప్’ను ఎంతమంది తల్లిదండ్రులు డౌన్‌లోడ్ చేసుకున్నారో మంత్రి ఆరా తీశారు. తల్లిదండ్రుల్లో మరింత అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa