అనేక రకాల వైరస్‌లతో బిక్కుబిక్కుమంటున్న తరుణంలో ఓ వ్యాధి భయాందోళనకు గురిచేస్తుంది. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో అంతుచిక్కని వ్యాధి బారినపడి వరాహాలు పెద్ద సంఖ్యలో మరణిస్తున్నాయి. 15 రోజుల్లో దాదాపు 1000కిపైగా పందులు చనిపోయాయి. దీంతో ఒక్కొక్కరు లక్షల్లో నష్టపోయినట్టు నిర్వాహకులు చెబుతున్నారు. పందులు ఏదైనా వైరస్‌తో చనిపోయి ఉంటే అది మనుషులకు సోకుతుందేమోనని అక్కడి ప్రజలు భయపడుతున్నారు.